: మ్యాజిక్ చేసి వార్న్ ను దాటేసిన నాథన్ లియాన్

బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ లో తొలి టెస్టును ఒకీఫ్ టీమిండియాకు దూరం చేస్తే...రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాను ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ కుప్పకూల్చాడు. ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్ల ఫీట్ సాధించలేకపోయిన లియాన్, ఒకే టెస్టులో పది వికెట్ల ఫీట్ సాధించేందుకు సిద్దంగా ఉన్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా వికెట్లు ఎనిమిది సాధించి సత్తాచాటాడు. దీంతో భారత ఉపఖండంలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా షేన్ వార్న్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. అంతే కాకుండా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇంతవరకు ఏ విదేశీ బౌలర్ సాధించని గణాంకాలు నమోదు చేశాడు. దీంతో ఈ పిచ్ పై అత్యధిక వికెట్లు తీసిన తొలి విదేశీ ఆటగాడిగా లియాన్ నిలిచాడు. 22.2 ఓవర్లు బౌలింగ్ చేసిన లియాన్ 4 మెయిడెన్ ఓవర్లు వేసి 2.23 సగటుతో 50 పరుగులిచ్చి 8 వికెట్లు తీసుకున్నాడు. ఇవి అతని కెరీర్ లోని అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. 

More Telugu News