: ముంచుకొస్తున్న పెను ప్రమాదం... ధృవ ప్రాంతాలు వేడెక్కుతున్నాయ్!

ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు ధృవ ప్రాంతాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ధృవ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. ఉత్తర అంటార్కిటిక్ ద్వీపకల్పంలోని అర్జెంటీనా రీసర్చ్ సెంటర్ 'ఎస్పరాంజా' బేస్ వద్ద రికార్డు స్థాయిలో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవల వెల్లడించింది. ఈ ప్రాంతంలో 1982 జనవరిలో 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడమే... ఇప్పటి వరకు ఉన్న రికార్డు. ఈ రికార్డు తాజాగా బద్దలయింది. ధృవాల వద్ద ఈ రేంజ్ లో ఉష్ణోగ్రతలు పెరగడంతో పర్యావరణవేత్తలు, పరిశోధకులు కలవరపడుతున్నారు. ధృవ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగితే మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయని, దీంతో పలు దేశాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతాయని, ఎన్నో ద్వీపాలు కనుమరుగు అవుతానయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News