: హెచ్1బీ వీసాలపై ట్రంప్ ఉక్కుపాదం.. ప్రీమియం వీసాల ప్రాసెసింగ్ పై ఆరు నెలల నిషేధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చేయాలనుకుంటున్న పనులన్నీ సైలెంట్ గా చేసుకుంటూ పోతున్నారు. విదేశీ ఉద్యోగులను నియంత్రించే క్రమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియకు సంబంధించి కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రీమియం వీసాల ప్రాసెసింగ్ పై ఆరు నెలల పాటు నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో హెచ్1బీ వీసా ఆశావహులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న వేలాది హెచ్1బీ అప్లికేషన్లను క్లియర్ చేసిన తర్వాత, హెచ్1బీ వీసాలను కొత్తగా జారీ చేస్తామని అధికారులు తెలిపారు. అయితే, వీసాలపై బ్యాన్ విధించడం ఆరు నెలలకే పరిమితం కాబోదని... ఆ తర్వాత కూడా బ్యాన్ ను పొడిగించే అవకాశాలను కొట్టి పారేయలేమని నిపుణులు అంటున్నారు. 

More Telugu News