: కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చిన ట్విట్టర్.. ఆమ్ ఆద్మీ అకౌంట్లను సస్పెండ్ చేస్తున్న వైనం!

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఊహించని షాక్ తగిలింది. అయితే ఆయనకు షాక్ ఇచ్చింది ఆయన బద్ధ శత్రువులైన బీజేపీ నేతలు కాదు. ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్. వివరాల్లోకి వెళ్తే, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక్కో ట్విట్టర్ అకౌంట్ ను సస్పెండ్ చేస్తూ వచ్చింది ట్విట్టర్ ఇండియా. తాజాగా 'ఆప్ ఇన్ న్యూస్' అనే అకౌంట్ ను కూడా నిలిపివేసింది.

దీంతో, కేజ్రీవాల్ కు ఒళ్లు మండిపోయింది. 'ట్విట్టర్ ఇండియాకు ఏమైంది?' అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ ట్విట్టర్ అకౌంట్లను, తమ పార్టీ మద్దతుదారుల అకౌంట్లను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, కేజ్రీవాల్ ప్రశ్నకు ట్విట్టర్ ఇంకా సమాధానం ఇవ్వలేదు. సోషట్ మీడియానే ఆయుధంగా మలచుకుని, ఉద్యమాలు నడిపి, ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఘనత ఆమ్ ఆద్మీ పార్టీది. ఇప్పుడు అదే సోషల్ మీడియా తమను ఇబ్బంది పెడుతుండటం కేజ్రీవాల్ కు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. 


More Telugu News