: జాదవ్ విషయంలో మాట మార్చిన పాకిస్థాన్.. అతను గూఢచారే అంటున్న పాక్!

కుల్ భూషన్ జాదవ్ అప్పగింత విషయంలో పాకిస్థాన్ మాట మార్చింది. గత ఏడాది మార్చ్ 3వ తేదీన పాక్ లోని బలూచిస్థాన్ లో ఆయను అరెస్ట్ చేశారు. ఆయన రా ఏజెంట్ అని, 2013 నుంచి పాక్ లో విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని పాక్ ఆరోపించింది. అయితే, గత ఏడాది డిసెంబర్ లో పాక్ విదేశాంగ శాఖ మంత్రి సర్తార్ అజీజ్ మాట్లాడుతూ, జాదవ్ నేరం చేసినట్టు తమ వద్ద తగిన ఆధారాలు లేవని చెప్పారు. దీంతో, ఆయనను భారత్ కు అప్పగిస్తారని అందరూ భావించారు.

కానీ, తాజాగా అజీజ్ మాట మారుస్తూ... పాక్ లో జాదవ్ ఉగ్రవాద, విద్రోహ చర్యలకు పాల్పడ్డారని, ఆయనపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఆయనను భారత్ కు అప్పగించలేమని తెలిపారు. అయితే, పాక్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని... జాదవ్ దారి తప్పి పాక్ భూభాగంలోకి వెళ్లాడని భారత అధికారులు చెబుతున్నారు.

More Telugu News