: కోర్టు మార్షల్ ను ఎదుర్కోవడం కంటే చనిపోవడమే మేలు.. సంచలనం సృష్టిస్తున్న జవాను డైరీ

ఆర్మీలో సహాయక్ వ్యవస్థపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి సంచలనం సృష్టించిన ఆర్మీ జవాన్ రాయ్ మ్యాథ్యూ(33) అనుమానాస్పద మృతి వెనక మిస్టరీ తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. పోలీసులకు లభ్యమైన అతడి డైరీలో పలు విషయాలను పోలీసులు గుర్తించారు. దానినే అతడి సూసైడ్ నోట్‌గా పోలీసులు భావిస్తున్నారు. స్టింగ్ ఆపరేషన్‌లో ఉన్నది తన గొంతు కాదని డైరీలో అతడు పేర్కొన్నట్టు అధికారులు తెలిపారు.

‘‘కోర్టు మార్షల్ (సైనిక న్యాయస్థానం)ను ఎదుర్కోవడం కంటే చనిపోవడమే నయం’’ అంటూ డైరీలో మలయాళంలో మ్యాథ్యూ రాసుకున్నారు. అలాగే భార్య, కుటుంబ సభ్యులు, తన కల్నల్‌కు క్షమాపణలు వేడుకున్నారు. మ్యాథ్యూ మృతదేహం లభ్యమైన నాసిక్‌లో పోలీసులు ఇతర సిపాయిలను ప్రశ్నిస్తున్నారు. స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన జర్నలిస్టును కూడా విచారించాలని పోలీసులు నిర్ణయించారు. రాయ్ మృతి వెనక కుట్ర ఉందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా మ్యాథ్యూ మృతిపై నిజానిజాలు తెలుసుకునేందుకు న్యాయవిచారణకు ఆదేశిస్తున్నట్టు ఆర్మీ తెలిపింది.




More Telugu News