: ఖాతాల్లో కనీస మొత్తం లేకున్నా బాదుడే.. ఎస్‌బీఐ సరికొత్త షాక్!

బ్యాంకులేవైనా బాదుడు మాత్రం కామన్ అనేలా ఉంది ప్రస్తుత పరిస్థితి. ప్రభుత్వ రంగ భారతీయ స్టేట్ బ్యాంకు కూడా ప్రైవేటు బ్యాంకుల దారి పడుతోంది. బ్యాంకు ఖాతాల్లో కనీస మొత్తం లేకుంటే జరిమానా కట్టాల్సిందేనంటూ తాజాగా వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. మెట్రో నగరాల్లో కనీసం రూ. 5 వేలు, నగరాలు, పట్టణాల్లో రూ. 2 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000 ఉండాలని నిబంధనలు విధించింది. ఆ మొత్తం లేకుంటే ఉన్న సొమ్మును బట్టి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

అలాగే నెలలో మూడు కన్నా ఎక్కువ లావాదేవీలు జరిపితే రూ.50 వసూలు చేయనున్నట్టు పేర్కొన్నారు. లావాదేవీలకు చార్జ్ చేయడం ఇది వరకే అమలులో ఉందని, ఇప్పుడు మళ్లీ ఏప్రిల్ 1 నుంచి దీనిని పునరుద్ధరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. వినియోగదారులు చీటికిమాటికి బ్యాంకుకు రాకుండా ఉండేందుకే ఈ నిబంధన తెచ్చినట్టు వివరించారు. అలాగే నెలకు పదిసార్లు ఏటీఎం నుంచి ఉచితంగా నగదు డ్రా చేసుకునే అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు.

More Telugu News