: ఖాతాదారులందరికీ నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించండి: కేంద్ర సర్కారు ఆదేశాలు

పెద్దనోట్ల రద్దు అనంతరం నగదురహిత లావాదేవీల దిశగా ఖాతాదారులను తీసుకెళ్లాలని ప్రయత్నాలు మొదలుపెట్టిన కేంద్ర సర్కారు ఈ రోజు మ‌రో అడుగువేసింది. దేశంలోని అన్ని బ్యాంకుల ఖాతాదారులకు నెట్ బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. నెట్ బ్యాంకింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. బ్యాంకుల్లో ఖాతాదారులందరికీ నెట్ బ్యాంకింగ్ సౌక‌ర్యం కల్పిస్తే న‌గ‌దుర‌హిత లావాదేవీలు మ‌రింత అధిక‌మ‌వుతాయ‌ని అంటున్నారు. కేంద్ర స‌ర్కారు నుంచి వ‌చ్చిన ఆదేశాల‌తో బ్యాంకులు తమ ఖాతాదారులందరికీ నెట్ బ్యాంకింగ్ కల్పించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాయి.

More Telugu News