: ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ లతో పోటీకి సై అంటున్న పేటీఎం.. భారీగా పెట్టుబ‌డులు

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదురహిత లావాదేవీల కోసం దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు పేటీఎంను అధికంగా వినియోగించ‌డంతో ఆ సంస్థ‌కు లాభాల పంట పండిన విష‌యం తెలిసిందే. ఇక త‌మ రీటెయిల్ బిజినెస్‌ను పెంచుకునేందుకు పేటీఎం భారీగా పెట్టుబ‌డులను స‌మీక‌రించుకునే ప‌నిలో ప‌డింది. చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ హోల్డింగ్‌తో పాటు ఇత‌ర సంస్థ‌ల‌ ద్వారా రూ.1337 కోట్ల‌ను రీటెయిల్ బిజినెస్‌లో పెట్ట‌నుంది.

ఇప్ప‌టికే ఈ కామ‌ర్స్ లో భార‌త్‌లో అగ్ర‌భాగాన ఉన్న ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల‌కు పోటీనివ్వ‌డానికి సై అంటోంది. చైనాలో త‌మ వ్యాపారం కాస్త‌ త‌గ్గిపోవ‌డంతో ప్ర‌స్తుతం అలీబాబా ఇత‌ర దేశాల్లో పెట్టుబ‌డులు పెట్టడానికి ప్రయ‌త్నిస్తోన్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే అలీబాబా.కామ్ సింగ‌పూర్ ఈ-కామ‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.782 కోట్ల పెట్టుబ‌డికి ఒప్పుకుంది. ప్ర‌తిగా పేటీఎంలో 36.31 శాతం వాటా ద‌క్కించుకుంది. ఇక సైఫ్ (ఎస్ఏఐఎఫ్‌) పార్ట్‌న‌ర్స్ పేటీఎంలో రూ.153.6 కోట్ల పెట్టుబ‌డి పెట్టి 4.66 శాతం వాటా పొందింది. గ‌త ఏడాది ఏప్రిల్‌లో రూ.6680 కోట్ల‌తో సౌత్ఈస్ట్ ఏషియ‌న్ ఆన్‌లైన్ రీటెయిల‌ర్ ల‌జాడా గ్రూప్ నియంత్ర‌ణ హ‌క్కుల‌ను అలీబాబా చేజిక్కించుకున్న విష‌యం విదిత‌మే.

More Telugu News