: బెంగళూరులో ఫ్యాన్స్ కి సెల్ఫీలకు పోజులిచ్చిన క్రికెట‌ర్‌ డేవిడ్ వార్నర్.. అలిగి వెళ్లిపోయిన కూతురు!

‘‘నా కూతురు ఇవీ మరోసారి మాకు వినోదాన్ని పంచింది.. చూడు బాలీవుడ్... ఆమె వచ్చేస్తోంది మరి... ’’ అంటూ ఇటీవ‌లే త‌న కూతురు డ్యాన్స్ చేస్తుండ‌గా తీసిన ఫొటోను ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు ఓపెన‌ర్ డేవిడ్ వార్నర్ సోష‌ల్ మీడియాలో ఉంచిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న గారాల కూతురు ఆయ‌న‌పై అలిగింద‌ట‌. రేప‌టి నుంచి బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియాల మ‌ధ్య‌ రెండో టెస్టు మ్యాచు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం డేవిడ్ వార్న‌ర్ త‌న భార్యాపిల్ల‌ల‌తో ఆ న‌గ‌రంలోనే ఓ హోటల్ లో ఉన్నాడు.

అయితే, ఈ రోజు ఉద‌యం త‌న కూతురు ఇవీతో క‌లిసి హోటల్ బయట న‌డుచుకుంటూ వెళుతున్న స‌మ‌యంలో ఆయ‌న‌ను గ‌మ‌నించిన భార‌త అభిమానులు ఆయ‌న‌తో సెల్ఫీలు దిగ‌డానికి ఎగ‌బ‌డ్డారు. అంత‌సేపు త‌న‌తో న‌డిచిన త‌న నాన్న.. ఫ్యాన్స్‌కి పోజులిస్తూ సెల్ఫీలు దిగుతుండ‌డంతో ఇవీ ఆయ‌న‌కు దూరంగా కొన్ని అడుగులు వెళ్లింది. అంతేకాదు నాన్న మీద కోపంతో త‌న‌ చేతిలో ఉన్న లాలీపాప్‌ను కూడా ప‌డేసింది. ఈ సంద‌ర్భంగా కెమెరాకు చిక్కిన ఆ దృశ్యాల‌ను వార్న‌ర్ భార్య త‌న‌ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది.  


More Telugu News