: 20 లక్షల ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్లు ప్రకటించిన కేరళ

2017-18 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ను నేడు అసెంబ్లీ ముందుకు ప్రవేశపెట్టిన కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, కీలక ప్రతిపాదన చేశారు. రాష్ట్రంలో పేదలను డిజిటల్ పరిధిలోకి తీసుకురావడం లక్ష్యంగా, 20 లక్షల ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాదిన్నరలో ఫోన్ నెట్ వర్క్ ద్వారా ఇంటర్నెట్ గేట్ వే సదుపాయాన్ని సమకూర్చేందుకు రూ. 1000 కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపారు. మధ్య తరగతి ప్రజల కోసం తక్కువ ధరకు నెట్ సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. ఇంటర్నెట్ సదుపాయం ప్రతి ఒక్కరి హక్కని ఈ సందర్భంగా ఐజాక్ వ్యాఖ్యానించారు.

More Telugu News