: తన భూభాగాన్ని అమ్ముతున్న మాల్దీవులు.. భారత్ భద్రతకు ముప్పు

భారత్ కు అతి చేరువలో ఉన్న దేశం మాల్దీవులు. ఈ దేశం 26 ద్వీపాల సమూహం. ఇప్పుడు ఈ దేశం ఒక ద్వీపాన్ని అమ్మకానికి పెట్టింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న అబ్దుల్లా యమీన్ ప్రభుత్వం 'ఫాఫు' అనే ద్వీపాన్ని సౌదీ అరేబియాకు అమ్మాలని భావిస్తోంది. ఈ విషయం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ.... ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేయడం లేదు. గతంలో విదేశీయులకు భూమిని అమ్మేవారికి మాల్దీవుల్లో ఉరిశిక్ష వేసేవారు. ఈ శిక్షను 2015లో రాజ్యాంగ సవరణ ద్వారా సడలించారు.

ఫాఫు ద్వీపం కొనుగోలు నేపథ్యంలో సౌదీ రాజు త్వరలోనే మాల్దీవులకు రానున్నారు. మాల్దీవుల భూభాగం మరో దేశం అధీనంలోకి వెళితే... భారత్ కు మరో భద్రతా సమస్య ఎదురైనట్టేనని నిపుణులు అంటున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత మన దేశం చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల్లో పర్యటించారు. ఒక్క మాల్దీవుల్లో మాత్రం పర్యటించలేదు. ఆ దేశంలో అంతర్గత వ్యవహారాలు సరిగా లేనందున... వారితో సరైన సంబంధాలను పెట్టుకునేందుకు ఇష్ట పడలేదు. కానీ, ఆ దేశంతో సంబంధాలు పెట్టుకోవాల్సిన ఆవశ్యకతను తాజా పరిస్థితులు కల్పించాయి.

More Telugu News