: బీదవాడని చందాలేసుకుని మరీ ఆటల పోటీలకు పంపిస్తే... అమెరికా వెళ్లి చిన్నారిపై దాష్టీకం!

చిన్నప్పటి నుంచి హిమాలయా మంచుకొండలనే క్రీడా మైదానంగా చేసుకుని ఎదిగిన యువకుడు. అమెరికాలో జరిగే ఆటల పోటీలకు వెళ్లేందుకు డబ్బు లేకపోతే, ఊరంతా కలసి చందాలేసుకుని మరీ డబ్బు పోగు చేసి ఇస్తే, ఆ డబ్బుతో యూఎస్ వెళ్లి, అక్కడ 12 ఏళ్ల బాలికను రేప్ చేసిన కేసులో కటకటాల వెనక్కు వెళ్లాడు, జమ్మూ కాశ్మీర్ కు చెందిన తన్వీర్ హుస్సేన్. తన్వీర్ తో పాటు ఖాన్ అనే మరో స్నో షూ ఆటగాడికి, అమెరికా వీసాలను నిరాకరిస్తే, పేద ఆటగాళ్లకు ప్రోత్సాహం లభించాలన్న సదుద్దేశంతో, అమెరికా సెనెటర్ల వరకూ విషయాన్ని తీసుకెళ్లిన గ్రామ పెద్దలు వారికి వీసాను ఇప్పించారు.

వారం రోజుల ప్రయాణ ఖర్చుల నిమిత్తం దాదాపు లక్ష రూపాయలు పోగు చేసి ఇచ్చారు. అక్కడికెళ్ళి పన్నెండేళ్ల బాలికపై అత్యాచారం చేశాడన్న వార్తను ఆ గ్రామ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. కాగా, ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని తన్వీర్ వాపోతున్న సంగతి తెలిసిందే. అతనికి కావాల్సిన న్యాయ సహాయాన్ని అందిస్తున్నట్టు యూఎస్ రాయభార కార్యాలయం తెలుపగా, ఇంగ్లీషు రాని కారణంగానే అతను ఇబ్బందులు పడుతున్నాడని తెలుసుకుని ఆ ప్రాంతంలోని రెండు భారత కుటుంబాలు సాయపడేందుకు ముందుకు వచ్చాయని తెలుస్తోంది.

More Telugu News