: జ‌యలలితను కిందకు తోసేశారు.. ఆస్పత్రిలో 27 సీసీ కెమెరాలను తొలగించారు: పాండియన్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆ రాష్ట్రానికి చెందిన ప‌లువురు నేత‌లు ఎన్నో అనుమానాలు వ్య‌క్తం చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఆమె మృతిపై ఆ రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్ మ‌రోసారి ఆరోపణలు గుప్పించారు. పోయెస్‌ గార్డెన్‌లోని వేద‌నిల‌యంలో ఆమెను కిందకు తోసేశారని ఆయ‌న అన్నారు. అనంత‌రం అపోలో ఆసుప‌త్రిలో ఆమె చికిత్స పొందుతుండ‌గా అక్క‌డి నుంచి 27కు పైగా సీసీటీవీ కెమెరాలను తొలగించారని ఆయ‌న ఆరోపించారు. ఈ అంశంపై అపోలో యాజమాన్యం వివరణ ఇవ్వాలని చెప్పారు.

జయలలిత డిసెంబర్ 4 సాయంత్రం 4:30 గంటలకు మృతి చెందార‌ని, అయితే, ఆ మరుసటి రోజున ఆమె మృతి చెందిన‌ట్టు ప్రకటించారని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్నా డీఎంకే అభ్యర్థుల ఏ, బీ ఫాంలపై ఆమె వేలిముద్రలను తీసుకున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. అలాగే, వేరే ఇతర ఏ డాక్యుమెంట్లపైన అయినా అమ్మ వేలిముద్రలు తీసుకున్నారా? అన్న ప్ర‌శ్న‌లకు స‌మాధానం కావాల‌ని ఆయ‌న తెలిపారు.

More Telugu News