: జీమెయిల్ వినియోగదారులకు వెసులుబాటు!

జీ మెయిల్ వినియోగదారులకు వెసులుబాటు లభించింది. ఇతర మెయిల్స్ నుంచి వచ్చే మెయిల్ సైజును రెట్టింపు చేస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. ఇకపై, ఇతర మెయిల్స్ నుంచి 50 ఎంబీ సైజు ఉన్న ఫైల్స్ ను జీ మెయిల్ వినియోగదారులు పొందవచ్చు. అంతకుముందు అయితే, అటాచ్ మెంట్లతో కలిపి జీమెయిల్ సైజు 25 ఎంబీ ఉండేది. 25ఎంబీ సైజు ఉన్న ఫైల్స్ మాత్రమే పొందేందుకు, పంపేందుకు అవకాశం ఉండేది.

గూగుల్ సంస్థ తాజా నిర్ణయం ప్రకారం, 50 ఎంబీ సైజు ఉన్న ఫైల్స్ ను జీ మెయిల్  వినియోగదారులు పొందవచ్చు. కాగా, పెద్ద సైజు ఫైల్స్ ను షేరు చేసుకోవాలంటే ‘డ్రైవ్’ అప్లికేషన్ ను వాడుకోవాలని, ఇది ఇప్పటికే జీ మెయిల్ తో కలిసి పనిచేస్తోందని పేర్కొంది. దీని నుంచి భారీ ఫైల్స్ ను కూడా పంపించే వీలుంది. జీమెయిల్ ఉన్నపళంగా సైన్ అవుట్ అవుతోందనే వినియోగదారుల ఫిర్యాదుపై ‘గూగుల్’ స్పందిస్తూ, ఈ విషయమై పరిశోధిస్తున్నామని, ఉన్నపళంగా సైన్ అవుట్ అవడమనేది అకౌంట్ సెక్యూరిటీ, ఫిషింగ్ దాడులకు సంబంధించిన అంశం కాదని స్పష్టం చేసింది.

More Telugu News