: యాహూ సీఈవోకు 20 లక్షల డాలర్ల బోనస్ కట్!

యాహూ సీఈవో మెరిస్సా మేయర్ కు ఆ సంస్థ యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఆమెకు చెల్లించాల్సిన బోనస్ ను కట్ చేసింది. గత ఏడాది లక్షలాది యాహూ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. దీనిపై జరిపిన విచారణలో ఉద్యోగుల తప్పు లేదని తేలినప్పటికీ... బాధ్యతారహితంగా వ్యవహరించినందుకు వారిపై యాహూ చర్యలు తీసుకుంది. కంపెనీ సీఈవో మెరిస్సాకు అందాల్సిన 20 లక్షల డాలర్ల బోనస్ ను కట్ చేస్తున్నట్టు యాహూ బోర్డు ప్రకటించింది.

ఈ నిర్ణయంపై ఆమె స్పందించారు. హ్యాకింగ్ పై కంపెనీ అసమర్థంగా వ్యవహరించినట్టు విచారణలో తేలిందని... జగిరిన పొరపాటుకు బాధ్యత వహిస్తున్నానని చెప్పారు. ఈ ఏడాది బోనస్ తో పాటు, ఈక్విటీ గ్రాంట్ ను కూడా వదులుకుంటున్నట్టు తెలిపారు. తనకు రావాల్సిన బోనస్ ను కంపెనీలో కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు పంచాలని కోరారు. యాహూకు 2012 నుంచి సీఈవోగా మెరిస్సా మేయర్ వ్యవహరిస్తున్నారు. గత ఏడాది 4.48 బిలియన్ డాలర్లకు యాహూను వెరిజాన్ సంస్థ కొనుగోలు చేసింది.   

More Telugu News