: ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశాలు ఇవే!

పర్యాటకులకు అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాను ద ఫారిన్ అండ్ కామన్వెల్త్ ఆఫీస్ (ఎఫ్ సీవో) విడుదల చేసింది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, లిబియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమెన్ దేశాల్లోని అన్ని ప్రాంతాల్లో పర్యాటకులకు ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని ఎఫ్ సీవో తెలిపింది. మరో 32 దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా పర్యాటకులకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. ఈ జాబితాలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఈజిప్ట్, జార్జియా, ఇరాక్, ఇజ్రాయెల్, ఇరాన్, మాలి, ఫిలిప్పీన్స్ తదితర దేశాలు ఉన్నారు.

రెండేళ్ల క్రితం ట్యునీషియాలోని సౌసీలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఓ ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 38 మంది దుర్మరణం పాలయ్యారు. విదేశీ పర్యాటకులే లక్ష్యంగా జరిగిన దాడుల్లో ఇదొక క్రూరమైన దాడిగా నిలిచిపోయింది. అప్పటి నుంచి పర్యాటకులకు ప్రమాదకర దేశాలను, ప్రాంతాలను గుర్తించే చర్యలు మరింత పెరిగాయి.

More Telugu News