: శశికళకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన కానిస్టేబుల్.. అరెస్ట్

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా కామెంట్ చేసిన పోలీస్ కానిస్టేబుల్ వేల్ మురుగన్ (43)ను సస్పెండ్ చేశారు. తేని జిల్లా ఊడైపట్టి పోలీస్ స్టేషన్ లో అతను విధులు నిర్వహిస్తున్నాడు. అతను దివంగత జయలలితకు వీరాభిమాని. జయ ఆసుపత్రిలో ఉన్నప్పుడు... ఆమె పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని, మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టాలని కోరుతూ... యూనిఫాంలోనే తలనీలాలు సమర్పించాడు. ఇది అప్పట్లో వివాదాస్పదం అయింది.

ఆ తర్వాత పన్నీర్ సెల్వంకు వేల్ మురుగన్ మద్దతుగా వ్యవహరించాడు. అంతేకాదు, శశికళకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. శశికళ సీఎం కావడాన్ని వ్యతిరేకిస్తూ, చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరించాడు. దీంతో, పోలీసు ఉన్నతాధికారులు అతడిని హెచ్చరించారు. అయినా, అతని తీరు మారలేదు. దీంతో అతడిని సస్పెండ్ చేశారు.

ఈ నేపథ్యంలో, తేని జిల్లా గూడలూరు లోయర్ క్యాంప్ లో మురుగన్ నిరాహార దీక్ష చేపట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని... అనుమతులు లేకుండా దీక్ష చేపట్టకూడదంటూ అతడిని అరెస్ట్ చేశారు.

More Telugu News