: జాతీయ రహదారుల పక్కన వైన్ షాపులు మాత్రమే నిషేధం... బార్లు, పబ్బులకు కాదు: సుప్రీంకోర్టు

జాతీయ రహదారులకు 500 మీటర్ల దూరం వరకూ మద్యం అమ్మకాల నిషేధం కేవలం వైన్ షాపులకు మాత్రమే వర్తిస్తుందని, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులకు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్టు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వెల్లడించారు. ఈ మేరకు కేరళ ప్రభుత్వానికి ఆయన సమాచారం ఇచ్చారు. ఏప్రిల్ ఒకటి నాటికి హైవేలపై ఉన్న మద్యం షాపులను తొలగించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన తరువాత, కేరళ ప్రభుత్వం, తమ ఆదాయం దెబ్బతింటోందని చెబుతూ, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో సుప్రీం రూలింగ్ మద్యం షాపులకు మాత్రమే వర్తిస్తుందని, బార్లకు కాదని అటార్నీ జనరల్ వివరణ ఇచ్చారు. ఈ విషయంలో గతంలో ఇచ్చిన సుప్రీం తీర్పు స్పష్టంగా ఉందని ఆయన అన్నారు.

More Telugu News