: అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విండీస్ స్టార్ క్రికెటర్

వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న స్మిత్ నిన్న తన రిటైర్మెంట్ ను ప్రకటించారు. 2004లో దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ లో స్మిత్ అరంగేట్రం చేశాడు. తాను ఆడిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు. తన 13 ఏళ్ల కెరిర్ లో కేవలం 10 టెస్టులు మాత్రమే ఆడాడు. తన కెరియర్లో 105 వన్డేలు ఆడిన స్మిత్... 1560 పరుగులు చేసి, 61 వికెట్లు తీశాడు. 33 టీ20లు ఆడిన స్మిత్ 582 పరుగులు చేసి, 7 వికెట్లు పడగొట్టాడు. మూడు టీ20 వరల్డ్ కప్ లలో వెస్టిండీస్ కు స్మిత్ ప్రాతినిధ్యం వహించాడు. 2007 తర్వాత అతను మూడేళ్లపాటు జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ 2010లో జట్టులోకి వచ్చాడు. రెండేళ్లుగా స్మిత్ ను జట్టులోకి ఎంపిక చేయకపోవడంతో... అతను అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.

More Telugu News