: పవన్, అల్లు అర్జున్ అభిమానుల మాటల యుద్ధం!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ ఇద్దరు హీరోల అభిమానులు విమర్శలు గుప్పించుకుంటున్నారు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ ల తాజా చిత్రాలు వరుసగా ‘కాటమరాయుడు’, ‘డీజే’ల టీజర్లు ఇటీవల విడుదలయ్యాయి. అయితే, ‘డీజే’ టీజర్ కు లక్షకు పైగా ‘డిస్ లైక్స్’ వచ్చాయి. దీనికి కారణం పవన్ కల్యాణ్ అభిమానులేనని, ఆయన అభిమానులే ఈ పని చేశారంటూ బన్నీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

అదే విధంగా, ‘కాటమరాయుడు’ టీజర్ విడుదలైన ఒక గంటలోపే సుమారు ఐదు వేలకు పైగా ‘డిస్ లైక్స్’ వచ్చాయి. ఈ ‘డిస్ లైక్స్’ కొట్టింది బన్నీ అభిమానులేనని పవర్ స్టార్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇదిలా ఉండగా, పవన్ పై అల్లు అర్జున్ గతంలో చేసిన కామెంట్స్ కారణంగానే ఈ తేడాలు వచ్చాయని పవర్ స్టార్ అభిమానులు చెబుతుండటం గమనార్హం.

More Telugu News