: ఇండియాలో 5జీ తరంగాల వేలం... ఏర్పాట్లు చేస్తున్న టెలికం!

4జీ తరంగాలు ఇంకా దేశవ్యాప్తం కాలేదు, అప్పుడే 5జీ వచ్చేస్తోంది. ప్రతి సంవత్సరమూ నిర్వహిస్తున్న స్పెక్ట్రమ్ వేలంలో భాగంగా ఈ సంవత్సరం 5జీ తరంగాల వేలాన్ని తొలిసారిగా నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు టెలికం శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ వెల్లడించారు. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో పాల్గొన్న ఆయన, ఈ విషయంలో అతి త్వరలోనే ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా)కు సిఫార్సులు పంపించనున్నట్టు తెలిపారు. జూలై - డిసెంబర్ మధ్య కాలంలో మలివిడత వాయు తరంగాల వేలం ఉంటుందని, టెలికం కంపెనీల పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వేలం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తాజా వేలంలో ఏ మేరకు స్పెక్ట్రమ్ విక్రయాలు సాగుతాయి? కొత్త బ్యాండ్స్ ఏమిటి? కనీస ధర ఎంత? వంటి అంశాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

More Telugu News