: ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య వాగ్వివాదం.. కృష్ణా బోర్డు జోక్యంతో సద్దుమణిగిన పంచాయితీ

నాగార్జున సాగర్‌ డ్యాం వద్ద ఈ రోజు ఆందోళ‌న‌క‌ర‌ వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. ఏపీలోని ప‌లు గ్రామాల‌కు వేసవిలో తాగు నీటిని అందించే నాగార్జున సాగర్ కుడికాలువకు తెలంగాణ అధికారులు నీటిని నిలిపివేయాల‌ని చూసిన సంగ‌తి తెలిసిందే. దీంతో అంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్‌ అధికారుల మధ్య వాగ్వివాదం చెల‌రేగింది. నీటి విడుదల కొనసాగించాలని ఏపీ ఇంజినీర్లు పట్టుబట్టడంతో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగింది. త‌మ రాష్ట్రానికి కేటాయించిన మొత్తం 17 టీఎంసీల్లో 13 టీఎంసీలు మాత్రమే వాడామని, మిగిలిన 4 టీఎంసీల నీరు వదలాలని ఏపీ ఇంజినీర్లు అన్నారు. చివ‌రికి ఈ విష‌యంపై కృష్ణాబోర్డు జోక్యం చేసుకోవ‌డంతో ప‌రిష్కారం ల‌భించింది. ఏపీకి ఒక టీఎంసీ నీటిని విడుద‌ల చేయాల‌ని కృష్ణా బోర్డు అధికారులు చేసిన సూచ‌న‌కు తెలంగాణ అధికారులు ఒప్పుకున్నారు.

More Telugu News