: దిగ్విజయ్ సింగ్ పై హైదరాబాదులో కేసు నమోదు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై పోలీసు కేసు నమోదైంది. మతాన్ని, మత విశ్వాసాలను అవమానించారన్న ఆరోపణలతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 295ఏ ప్రకారం కేసు నమోదు చేశారు. మదర్సాలు, ఆరెస్సెస్ నడుపుతున్న సరస్వతి శిశు మందిరాల గురించి దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మదర్సాలు, సరస్వతి శిశు మందిరాలు మత విద్వేషాలను వ్యాపింపజేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 22న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, కావాలనే దురుద్దేశపూర్వకంగా దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, మదర్సాలు, ఆరెస్సెస్ నడుపుతున్న పాఠశాలలు అంటూ దిగ్విజయ్ మతపరమైన అంశాలను లేవనెత్తారంటూ మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) నేత అమ్జెద్ ఉల్లాహ్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, హైదరాబాదులోని డబీర్ పుర పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. 

More Telugu News