: నోట్ల రద్దు ప్రభావం వృద్ధిరేటుపై తాత్కాలికమే... వచ్చే ఆర్థిక సంవత్సరం 7.3 శాతంగా అంచనా

దేశంలో పాత నోట్ల రద్దు వల్ల వృద్ధిరేటుపై తాత్కాలిక ప్రభావం మాత్రమే ఉంటుందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 7 శాతంగా ఉంటుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం 7.3 శాతంగా ఉంటుందని తాము అంచనా వేస్తున్న‌ట్లు తెలిపింది. అలాగే 2019లో భారత్ వృద్ధిరేటు 7.7 శాతంగా ఉండవ‌చ్చని చెప్పింది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్దనోట్ల ర‌ద్దుతో దేశానికి దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయని తేల్చి చెప్పింది.

More Telugu News