: పోలీస్ బందోబస్తు మధ్య ప్రారంభమైన లిక్కర్ ఫ్యాక్టరీ

గ్రేటర్ వరంగల్ సమీపంలో ఉన్న గుండ్లసింగారం లిక్కర్ ఫ్యాక్టరీ ఈరోజు మళ్లీ పున:ప్రారంభమయింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ ఫ్యాక్టరీని ప్రారంభించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ 19 మంది హమాలీలను ఫ్యాక్టరీలోకి తీసుకోవాలని సిఫారసు చేయడంతో... పాత, కొత్త హమాలీల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటన జనవరి 23న చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో జనవరి 24 నుంచి ఫ్యాక్టరీ నుంచి మద్యం సరఫరా ఆగిపోయింది. దీంతో, ప్రభుత్వానికి రూ. 9 కోట్ల నష్టం వాటిల్లింది.

ఈ నేపథ్యంలో, 89 మంది పాత హమాలీలతో ఫ్యార్టరీ నుంచి లిక్కర్ సప్లై ప్రారంభమయింది. మరోవైపు, తమను కూడా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 19 మంది కొత్త హమాలీలు ఫ్యాక్టరీ గేటు ముందు బైఠాయించి, ఆందోళన చేశారు.

More Telugu News