: దేశవ్యాప్త సమ్మెకు దిగిన బ్యాంకులు... సేవలకు అంతరాయం

వేతనాల పెంపు సహా సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులు నేడు సమ్మెకు దిగడంతో సాధారణ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘాల్లోని అత్యధిక యూనియన్లు మద్దతు పలికాయి. ఇదే సమయంలో ప్రైవేటు రంగంలోని ప్రధాన బ్యాంకులైన ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా వంటి బ్యాంకులు పనిచేస్తున్నప్పటికీ, చెక్ క్లియరెన్స్ సేవలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకుల సేవలకు అంతరాయం కలుగవచ్చని తమ తమ కస్టమర్లకు సమాచారాన్ని అందించాయి. బ్యాంకు ఉద్యోగుల్లో 9 అనుబంధ సంఘాలను కలిగివున్న యూఎఫ్బీయూ (యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్) సమ్మెకు మద్దతు పలకగా, భారతీయ మజ్దూర్ సంఘ్ మాత్రం సమ్మెలో లేదు.

More Telugu News