: వరంగల్‌లో ధూంధాం కళాకారుడి ఆత్మహత్య

ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమంలో తన గొంతుతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేసిన ధూంధాం కళాకారుడు బొల్లం మధు(26) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ  మండలం ఎలుకుర్తి హవేలి గ్రామానికి చెందిన మధు హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుకున్నాడు. పాటలు రాయడమన్నా, పాడడమన్నా ఎంతో ఇష్టం. ఉద్యమ సమయంలో జేఏసీలో కీలకపాత్ర పోషిస్తూనే ధూంధాం కళాకారుల బృందంలో చేరాడు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన  ధూంధాం కార్యక్రమాల్లో పాల్గొని పాటలతో ప్రజల్లో చైతన్యం నింపాడు. 2011లో డిగ్రీ పూర్తిచేసిన మధు ఉద్యోగం రాక, ఉపాధి మార్గం కనిపించక కొంతకాలంగా ఆవేదనగా ఉన్నాడు. మనస్తాపం చెందిన మధు ఈనెల 23న ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  సోమవారం మృతి చెందాడు.

More Telugu News