sehwag: ట్రిపుల్ సెంచరీలు చేసింది నేను కాదు.. నా బ్యాట్: సెహ్వాగ్

విధ్వంసకర బ్యాటింగ్ తో శివాలెత్తిపోయే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ లో ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. తాను చేసిన రెండు ట్రిపుల్ సెంచరీలు.. తాను చేసినవి కాదని, అవి తన బ్యాట్ చేసినవంటూ ట్వీట్ చేశాడు. ‘ఐ డోంట్ స్కోర్ టూ ట్రిపుల్ సెంచరీస్, మై బ్యాట్ డిడ్ (రెండు ట్రిపుల్ సెంచరీలు నేను చేయలేదు. నా బ్యాట్ చేసింది)' అని రాసి ఉన్న ఒక ప్లకార్డు పట్టుకుని ఉన్న ఫొటోను పోస్టు చేశారు.

దీనిపై సోషల్ మీడియాలోను, బయటా విభిన్నమైన స్పందన వ్యక్తమవుతోంది. ఢిల్లీలోని రంజాస్ కాలేజీలో జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో గుర్ మెహెర్ కౌర్ అనే ఓ విద్యార్థిని పెట్టిన ట్వీట్, ఫొటోకు కౌంటర్ గానే వీరూ ఈ ట్వీట్ చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గురు మెహెర్ కౌర్ తండ్రి కెప్టెన్ మణిదీప్ సింగ్ కార్గిల్ వార్ లో మరణించారు. దానిని ఉద్దేశిస్తూ ఆమె.. ‘పాకిస్థాన్ నా తండ్రిని చంపలేదు. యుద్ధమే చంపింది’ అని ప్లకార్డు పట్టుకున్న ఓ ఫొటోను పోస్టు చేసింది. దానికి కౌంటర్ గానే వీరూ ట్వీట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే వీరూ మాత్రం తాను ఎందుకలా ట్వీట్ చేశాననే విషయాన్ని మాత్రం ఎక్కడా వెల్లడించలేదు.

More Telugu News