: నా ప్రేమను నా నుంచి దూరం చేశారు.. నేను మాత్రం ఇక్కడే ఉండి ప్రేమను పంచుతా!: బీబీసీ ఇంటర్వ్యూలో కూచిభొట్ల సునయన

"ఇటీవల అమెరికాలో జరిగిన ఎన్నికలను నా భర్త శ్రీనివాస్ చాలా దగ్గర నుంచి గమనించాడు. నాకు మాత్రం ఎంతో బాధగా, భయంగా ఉండేది. రాత్రిపూట నిద్రపట్టేది కాదు. ఈ దేశం మనకు క్షేమమా? అని ప్రశ్నించేదాన్ని. మనకు రక్షణ ఉందా? అని శ్రీనును అడిగేదాన్ని. ఏమీ జరగదని నన్ను ఊరడించేవాడు. అమెరికా ఇంత ఘోరంగా మారుతుందని కలలో కూడా అనుకోలేదు. విద్వేష పూరిత నేరాలు ఇప్పుడు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి" అని బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూచిభొట్ల సునయన కన్నీటి పర్యంతమైంది.

తాముండే ప్రాంతంలో గతంలో ఎన్నడూ ఇటువంటి ఘటనలు జరగలేదని తెలిపారు. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉండేవారని చెప్పుకొచ్చారు. తన భర్త అమెరికాను ప్రేమించాడని, ఇక్కడే చదువుకున్నాడని గుర్తు చేశారు. ఎంతో మంది స్నేహితులు ఆయనకు ఉన్నారని, ఎన్నో ఆశలతో ఇక్కడ జీవిస్తున్నామని చెప్పారు. అమెరికాకు ఎంతో చేయాలన్నది శ్రీనివాస్ ఆశని వివరించారు. ఇప్పుడు తన ఇంట్లో ఉన్నవారంతా తాము సరైన ప్రదేశంలోనే ఉన్నామా? అన్న ఆందోళనలో ఉన్నారని అన్నారు. అమెరికాలో ఉండటం మంచి నిర్ణయమేనా? అని ప్రశ్నించుకుంటున్నారు. ఇక్కడి విద్వేషకులు నా నుంచి మా ఆయన్ని దూరం చేశారు. ఆయన మరణం తరువాత అమెరికాకు ఇక రాకూడదని భావించాను. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నా. నా ప్రేమను నానుంచి దూరం చేశారు. నేను మాత్రం ఇక్కడే ఉండి ప్రేమను పంచుతా'నని చెప్పారు.

More Telugu News