: అమెరికాలో ఎనిమిదేళ్లలో 30 మంది తెలుగువారు దుర్మరణం

అమెరికాలోని కాన్సస్ ఘటనతో అమెరికాలోని ప్రవాస భారతీయుల్లో మరోమారు గబులు రేగింది. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా తెలుగువారిపై జరుగుతున్న దాడులు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2008 నుంచి ఇప్పటి వరకు అంటే ఆరేళ్లలో అగ్రరాజ్యంలో 30 మంది తెలుగువారు దుర్మరణం చెందారు. వీరిలో విద్యార్థులు, టెక్కీలు కూడా ఉన్నారు. 30 హత్యల్లో అత్యంత దారుణమైన ఘటనలు పది వరకు ఉన్నాయి.

ఫిబ్రవరి 10, 2017న వరంగల్‌కు చెందిన మామిడాల వంశీరెడ్డిని కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో ఓ దుండగుడు కాల్చి చంపాడు. జూలై 2016లో హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్(25)‌ను ఆస్టిన్‌లో అతడి రూమ్మేటే కాల్చి చంపాడు. జూన్ 2015లో హైదరాబాద్‌కే చెందిన ఎంఎస్ సాయికిరణ్ ఫ్లోరిడాలో దుండగుల కాల్పుల్లో బలయ్యాడు. అతని వద్దనున్న ఐ ఫోన్ ఇవ్వలేదనే కారణంతో దుండగుడు ఆయనపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈలప్రోలు జయచంద్ర(22) 2014లో టెక్సాస్ సమీపంలో దుండగుల కాల్పులకు బలయ్యాడు. అమెరికాలో తెలుగువారిపై జరిగిన హత్యల్లో ఇవి కొన్ని మాత్రమే. దుండగుల తూటాలకు ఇప్పటి వరకు 30 మంది అమెరికాలో అసువులు బాశారు.

More Telugu News