: దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా!

పూణే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆటను ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ధాటిగా ప్రారంభించాడు. మరోపక్క, పిచ్ పై ఉన్న తేమను వినియోగించుకుని లబ్ధి పొందేందుకు టీమిండియా కెప్టెన్ కోహ్లీ బంతిని అశ్విన్ కు అందించాడు. స్టీవ్ స్మిత్ భారీ షాట్లు కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా, మరోవైపు మిచెల్ మార్ష్ జాగ్రత్తగా ఆడుతున్నాడు. నేడు ఆసీస్ ఆటగాళ్లను ఎంత త్వరగా పెవిలియన్ కు పంపితే అంతగా తమకు విజయావకాశాలు ఉంటాయని టీమిండియా ఆటగాళ్లు భావిస్తుండగా, ఇప్పటికే 298 పరుగుల ఆధిక్యం కలిగిన తాము వీలైనన్ని ఎక్కువ పరుగులు స్కోరు బోర్డుపై జోడించి, తొలి ఇన్నింగ్స్ లా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూలిస్తే భారీ విజయం దక్కుతుందని, ఏప్రిల్ 1 నాటికి ఐసీసీ పరిగణనలోనికి తీసుకునే రేటింగ్స్ లో దూసుకుపోవచ్చని ఆస్ట్రేలియా జట్టు భావిస్తోంది. 

More Telugu News