: షుగర్ వ్యాధిగ్రస్థులకు శుభవార్త... మందులు, ఇంజెక్షన్లు లేకుండా నివారణ పద్ధతి!

మధుమేహ వ్యాధిగ్రస్థులకు పరిశోధకులు శుభవార్త వినిపించారు. షుగర్ వ్యాధి ముదిరితే ప్రతిరోజూ ఇన్సులిన్ తీసుకోవాలి, ప్రతి రోజూ మందులు వాడాల్సి ఉంటుంది. షుగర్ నియంత్రణలో ఉంచుకునేందుకు వివిధ రకాలైన వైద్యవిధానాలు అనుసరిస్తుంటారు. అయినప్పటికీ కొంత మందిలో ఫలితం కనిపించకపోవడం, అది తీవ్రరూపం దాల్చితే కిడ్నీలు సరిగ్గా పని చేయకపోవడం వంటి రుగ్మతలకు దారితీస్తుందని నిపుణులు చెబుతుంటారు. ఇకపై వీటన్నింటికీ తెరపడనుంది.

మందులు, ఇంజెక్షన్లతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధికి శాస్త్రవేత్తలు చికిత్స కనుగొన్నారు. దీనికి ఎఫ్ఎండీ చికిత్సా విధానం అని శాస్త్రవేత్తలు పేరుపెట్టారు. కేవలం నెలలో 5 రోజులు ప్రత్యేకమైన ఆహారం తీసుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చని తెలిపారు. ఇది అందరికీ అందుబాటులో ఉన్న, ఆరోగ్యకరమైన విధానమని చెబుతున్నారు. అయితే దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

More Telugu News