: ఆస్ట్రేలియా ప్రయోగించిన ఆయుధం పాటించిన సలహాలు వీరివే!

ఆస్ట్రేలియా జట్టు భారత్ పై పూణే టెస్టులో ప్రయోగించిన ఆయుధం ఎడమచేతి వాటం లెగ్ స్పిన్నర్ ఒకీఫె ఎలా భారతీయుల నడ్డి విరచగలిగాడు? అంటే భారత ఆటగాళ్ల నిర్లక్ష్యం, అతనిపై శ్రద్ధ పెట్టకపోవడం అని తెలుస్తోంది. 32 ఏళ్ల ఒకీఫె ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌ లో పేరున్న ఆటగాడే. దేశవాళీ టోర్నీల్లో ఇప్పటి వరకు 225 వికెట్లు తీశాడు. అయితే గట్టి పోటీ ఉన్న ఆస్ట్రేలియా జట్టులో స్థానం సంపాదించి అంతర్జాతీయ క్రికెట్‌ లోకి అడుగుపెట్టేందుకు చాలా సమయం పట్టింది. 2014లో శ్రీలంకతో ఆడి నాలుగు మ్యాచ్‌ లలో 14 వికెట్లు తీశాడు. దీంతో ఆ సమయంలో ఏర్పడిన పరిచయంతో శ్రీలంక స్పిన్నర్ రంగన హెరాత్ ను భారతీయుల ఆటకట్టించడంలో మెళకువలు అడిగి తెలుసుకున్నాడు.

అలాగే ఇంగ్లండ్ ఆటగాడు మాంటీ పనేసర్ ను టీమిండియా ఆటగాళ్లకు అడ్డుకట్టవేసే మెళకువలు అడిగి తెలుసుకున్నాడు. దీనికి తోడు షేన్ వార్న్ ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడు. ఈ నేపథ్యంలో దుబాయ్‌ లో నిర్వహించిన ప్రాక్టిస్ సెషన్స్ లో వారు చెప్పిన సలహాలు అమలు చేశాడు. అంతే కాకుండా 2015లో ఆస్ట్రేలియా-ఎ జట్టు సభ్యుడిగా భారత్‌ లో రెండు అనధికార మ్యాచ్‌ ల టెస్ట్ సిరీస్‌ లో ఆడాడు. ఈ అనుభవం ఇప్పుడతనికి అక్కరకొచ్చింది. అంతే కాకుండా భారత ఆటగాళ్లు ఆసీస్ ప్రధాన స్పిన్నర్‌ నాథన్ లియోన్‌ పై దృష్టిపెట్టారు. దీంతో ఒకీఫె తన పని తాను చేసుకుపోయాడు. అదీ కాకుండా ఎడమచేతి వాటం ఆటగాడు కావడంతో రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ ను సులువుగా బోల్తా కొట్టించాడు. 

More Telugu News