: భారీ ఆధిక్యం దిశగా ఆస్ట్రేలియా...రెండో రోజు ముగిసిన ఆట

రెండో రోజు ఆట మొత్తాన్ని ఆస్ట్రేలియా ఆక్రమించింది. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ ఆధారంగా ఆసీస్ తో పూణే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైంది. ఆసీస్ చేతిలో ఘోరపరాభవం దిశగా సాగుతోంది. 256 పరుగుల మొదటి రోజు స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో ఐదు బంతులకే ఇన్నింగ్స్ ముగించింది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు, ఒకీఫ్, స్టార్క్ ధాటికి కుప్పకూలింది. కేవలం 105 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా ఆటగాళ్లలో ఇద్దరు డకౌట్ కాగా, మరో ఐదుగురు ఆటగాళ్లు డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయలేకపోయారు.

దీంతో టీమిండియాపై ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 170 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అనంతరం కెప్టెన్ ఇన్నింగ్స్ తో స్టీవ్ స్మిత్ (59) ఆకట్టుకున్నాడు. అతనికి రెన్ షా (31), హ్యాండ్స్ కొంబ్ (19), మిచెల్ మార్ష్ (21) నుంచి చక్కని సహకారం లభించింది. దీంతో అర్ధ సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు రెండో రోజు ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లతో రాణించగా, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. దీంతో రెండో రోజు ఆటలో 15 వికెట్లు నేలకూలగా, 252 పరుగులు స్కోరు బోర్డుపై చేరాయి. దీంతో ఆసీస్, భారత్ పై 298 పరుగుల ఆధిక్యం కలిగి ఉంది. ఇంకా ఆరు వికెట్లు, మూడు రోజుల ఆట ఇంకా మిగిలి ఉంది. 

More Telugu News