: తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వాతావరణం

తెలుగు రాష్ట్రాల ప్రజలను మారిన వాతావరణ పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశించేనాటికి వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు 26 డిగ్రీల నుంచి 31 డిగ్రీల మధ్య నమోదైన ఉష్ణోగ్రతల్లో మార్పు సంభవించడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటి నుంచి ఎండలు మండిపోతున్నాయి. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో, ఇక మే నెలలో వాతావరణం ఎలా ఉండనుందో అంటూ జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు.

అనంతపురంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది కేవలం రాయలసీమకు మాత్రమే పరిమితం కాలేదని, తెలంగాణలో కూడా ఇదే తీరున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. పాలమూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో 39 డిగ్రీలు నమోదవుతున్నాయి. హైదరాబాదులో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. కోస్తాంధ్రలో ఎండలు ముదిరినా మరీ ఇంత తీవ్ర స్థాయిలో లేవని తెలుస్తోంది. అయితే ఎండలు లేకున్నప్పటికీ అక్కడ సముద్రం మీదుగా వీస్తున్న గాలుల్లో తేమకారణంగా ఉక్కపోతగా ఉంటోందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. 

More Telugu News