: జైలు జీవితానికి అలవాటు పడుతున్న ‘చిన్నమ్మ’.. రోజూ ధ్యానం, తులసి చెట్టుకు ప్రదక్షిణలు!

సీఎం  పీఠాన్ని తృటిలో కోల్పోయి  జైలుకు వెళ్లిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ క్రమంగా జైలు జీవితానికి అలవాటు పడుతున్నారు. మొదట్లో ఖైదీల సెల్‌లో ఎవరితోనూ మాట్లాడకుండా గడిపిన ఆమె తనలోని దుఃఖం బయటకు కనబడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే నాలుగేళ్లపాటు జైలు శిక్ష అనుభవించక తప్పదనే సత్యాన్ని నెమ్మదిగా గ్రహించిన ‘చిన్నమ్మ’ క్రమంగా జైలు జీవితానికి అలవాటు పడుతున్నారు. జైలు అధికారులు ఇచ్చిన చాప, రెండు నీలంరంగు చీరలు, చెంబు, ఇనప మంచం, రెండు దుప్పట్లతోనే సరిపెట్టుకుంటున్నారు.

 రోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేస్తున్న శశికళ గంటపాటు సెల్‌లోనే ధ్యానం చేస్తున్నారు. తర్వాత వేడినీళ్లతో స్నానం చేసి జైలు ప్రాంగణంలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు. జైల్లో ఉన్నప్పుడు జయలలిత పూజించిన తులసి మొక్క వద్ద ప్రదక్షిణలు చేసి పూజలు చేస్తున్నారు. తర్వాత తమిళం, ఇంగ్లిష్ దినపత్రికలు చదువుతున్నారు. మధ్యాహ్నం వరకు టీవీ చూస్తూ గడుపుతున్న శశికళ తనకోసం ఎవరైనా వస్తే కలిసి మాట్లాడుతున్నారు. రాత్రి ఏడు గంటలకు భోజనం చేసి పది గంటలకు నిద్రపోతున్నారు.

More Telugu News