: ఐపీఎల్ వేలంలో నిరాశ చెందిన ఇర్ఫాన్ పఠాన్ స్పందన ఇదీ!

ఐపీఎల్ 10వ సీజన్ కు ఇటీవల నిర్వహించిన వేలంలో ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్ లను ఏ ఫ్రాంచైజీ సొంతం చేసుకోలేదు. ఈ నేపథ్యంలో నిరాశ చెందిన ఇర్ఫాన్ పఠాన్ సుదీర్ఘమైన ట్వీట్ ఒకటి చేశాడు. ‘నా అభిమానులందరికీ..’ అంటూ ప్రారంభించిన ఆ ట్వీట్ ఇలా కొనసాగింది..‘ 2010లో, నా వీపు భాగంలో ఐదు సార్లు ఎముకలు విరిగాయి. ఇకపై, నేను క్రికెట్ ఆడేందుకు వీలుండకపోవచ్చని వైద్యులు సూచించారు. ఆ సమయంలో నేను వైద్యులకు ఒకటే మాట చెప్పాను... ఎంత నొప్పినైనా నేను భరిస్తాను. కానీ, నా దేశం తరపున క్రికెట్ ఆడలేననే బాధను మాత్రం భరించలేనని వారితో చెప్పాను.

ఆ తర్వాత నేను చాలా కష్టపడి క్రికెట్ ఆడటమే కాదు, టీమిండియాలోకి మళ్లీ వచ్చాను. నా జీవితంలో, క్రికెట్ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ, వాటికి భయపడి నేను వెనుకడుగు వేయలేదు. ఆ స్వభావమే నాలో ఎప్పటికీ ఉంటుంది. ప్రస్తుతానికి వస్తే.. నా ముందు ఈ ప్రతిబంధకం ఉంది. దానిని అధిగమించేందుకు కష్టపడుతూనే ఉంటా. నన్ను సపోర్ట్ చేసే మీ అందరితో ఈ విషయాలను పంచుకోవాలనిపించింది’ అని ఇర్ఫాన్ పఠాన్ తన సుదీర్ఘ ట్వీట్ లో పేర్కొన్నాడు.

More Telugu News