: సుప్రీంకోర్టు ఉత్తర్వులను లెక్కచేయని మాయావతి!

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును సైతం బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉల్లంఘించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె ప్రచారం చేస్తూ... ముస్లింలంతా సమాజ్ వాదీ పార్టీకి కాకుండా తమ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ముస్లింలు ఎస్పీకి ఓటు వేస్తే అది వ్యర్థమవుతుందని... అంతేకాకుండా, పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో కుల, మతాలను అనుసరించి ఓట్లు అడగరాదంటూ ఇటీవలే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఆమె సుప్రీం ఉత్తర్వులను ధిక్కరించినట్టైంది.

మరోవైపు, ప్రధాని మోదీపై మాయావతి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ కులమతాలను వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి గ్రామంలో ఖబరస్తాన్, శ్మశానం ఉండాలంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు మతాల పేరుతో ఓట్లు అడగడమే అని విమర్శించారు. ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పని చేయాలని, ఆ తర్వాత యూపీ గురించి మాట్లాడాలని మోదీకి మాయావతి సూచించారు.

More Telugu News