: శ్రీవారి సేవలో కేసీఆర్.. స్వామి వారికి బంగారు ఆభరణాల సమర్పణ

తిరుమల శ్రీవారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులు, తెలంగాణ మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం, వకుళామాతను, శ్రీ విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారు.

రూ.5 కోట్ల విలువ చేసే 14.2 కిలోల బంగారు సాలిగ్రామ హారం, 4.65 కిలోల బంగారు కంఠెను స్వామి వారికి సమర్పించారు. అంతకుముందు, రంగనాయకుల మండపంలో తెలంగాణ ప్రభుత్వం స్వామి వారికి బహూకరించనున్న ఈ బంగారు ఆభరణాలను టీటీడీ అధికారులు ప్రదర్శించారు. వీటిని తన కుటుంబసభ్యులు, మంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ తిలకించి, ఏడు కొండల వాడి దర్శనానికి వెళ్లారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఇంకా తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్, పద్మారావు, ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత తదితరులు ఉన్నారు. 

More Telugu News