: రోహిత్ వేముల లేఖ చదివి ఏడ్చేశా!: వరుణ్ గాంధీ

రోహిత్ వేముల ఆత్మహత్య లేఖ చదివి తాను ఏడ్చేశానని బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ అన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చదువుతున్న రోహిత్ ఆత్మహత్య లేఖ చదివినప్పుడు ఎంత నిబాయించుకున్నా తన కంటి నుంచి నీరు ఆగలేదన్నారు. నిన్నమొన్నటి వరకు బలహీన వర్గాలకు చెందిన మహిళలు వంట చేశారన్న కారణంతో ప్రభుత్వ పాఠశాలల్లో 70 శాతం మంది పిల్లలు మధ్యాహ్న భోజనం తినేందుకు వెనకాడేవారన్నారు. అసలు మనం మన  పిల్లలకు ఏం నేర్పుతున్నామో, దేశం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదన్నారు. మనకు కావాల్సింది రాజకీయ ప్రజాస్వామ్యం కాదని, సామాజిక ప్రజాస్వామ్యమని అంబేద్కర్ ఏనాడో చెప్పారని వరుణ్ గాంధీ పేర్కొన్నారు.

More Telugu News