: అమరావతి డిజైన్లపై ప్రజాభిప్రాయం తీసుకుంటాం: మంత్రి నారాయణ

ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించతలపెట్టిన భవనాల సముదాయానికి సంబంధించిన డిజైన్లను పబ్లిక్ డొమైన్ లో ఉంచి ప్రజాభిప్రాయం తెలుసుకుంటామని మంత్రి నారాయణ అన్నారు. రాజధానిలోని 900 ఎకరాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ సముదాయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు సంబంధించిన డిజైన్లను లండన్ కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ ‘నార్మన ఫోస్టర్’ రూపొందిస్తోంది.

ఇందుకు సంబంధించి మొత్తం మూడు డిజైన్లను ఈ నెల 28న సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందజేస్తారని మంత్రి తెలిపారు. అయితే, ఈ డిజైన్లను పబ్లిక్ డొమైన్ లో ఉంచి ప్రజాభిప్రాయం తెలుసుకుంటామని, ఏ డిజైన్ ను అయితే అత్యధికులు మెచ్చుతారో దానిని ప్రభుత్వం ఆమోదిస్తుందని నారాయణ చెప్పారు. ఈ డిజైన్లకు సంబంధించి సదరు కంపెనీకి మన అభిప్రాయాలు, సూచనలు తెలియజేసే నిమిత్తం తాను మరోసారి లండన్ వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.

More Telugu News