: మా దేశానికి హఫీజ్ సయీద్ పెను ముప్పు: అంతర్జాతీయ సదస్సులో పాకిస్థాన్ రక్షణ మంత్రి

ఇంతకాలం తర్వాత పాకిస్థాన్ ఒక నిజాన్ని అంతర్జాతీయ సమాజం ముందు ఒప్పుకుంది. ముంబై దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయాద్ ను ఇంతకాలం వెనకేసుకొచ్చిన పాకిస్థాన్... ఇప్పుడు వాడి వల్ల తమ దేశానికి పెను ముప్పు ఉందని చెప్పింది. జర్మనీలోని మ్యూనిక్ నగరంలో జరిగిన అంతర్జాతీయ భద్రత సదస్సులో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ శ్రేయస్సు కోసం సయీద్ ను హౌస్ అరెస్ట్ చేశామని చెప్పారు. పాక్ కు విపరీతమైన హానిని సయీద్ తలపెట్టగలడు అని అన్నారు.

టెర్రరిస్టులు ఏ ఒక్క మతానికో చెందిన వారు కాదని... ఉగ్రవాదులు క్రిస్టియన్లు లేదా ముస్లింలు లేదా బౌద్దులు లేదా హిందువులు ఎవరైనా కావచ్చని పాక్ రక్షణ మంత్రి తెలిపారు. వీరంతా కేవలం టెర్రరిస్టులేనని... క్రిమినల్స్ అని చెప్పారు. టెర్రరిజంపై పోరాడేందుకు పాకిస్థాన్ కంకణం కట్టుకుందని అన్నారు. టెర్రరిజంపై పోరులో పాకిస్థాన్ ముందు వరుసలో నిలుస్తుందని చెప్పారు. అయితే పశ్చిమ దేశాలు ఒంటరిగా తీసుకునే నిర్ణయాలు టెర్రరిజంపై పోరాటానికి అవరోధాలుగా నిలుస్తాయని... ఇవి టెర్రరిజాన్ని మరింత పెంచే అవకాశాలను కొట్టిపారేయలేమని అభిప్రాయపడ్డారు.

More Telugu News