: నేను ఏపీలో పుట్టలేదా? నేను నచ్చకపోతే వేరే రాష్ట్రంలో వదిలేస్తారా?: రోజా ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. మహిళా సదస్సుకు తనను ఆహ్వానించి, ఆ తర్వాత అక్రమంగా అరెస్ట్ చేసి అవమానపరిచారని అన్నారు. మహిళల పట్ల ప్రభుత్వం అనుసరించే తీరు ఇదేనా? అని మండిపడ్డారు. ఓ మహిళా ఎమ్మెల్యే పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును చూసి, యావత్ దేశం నివ్వెర పోయిందని అన్నారు. స్పీకర్ నుంచి ఇన్విటేషన్ వచ్చింనందుకే సదస్సుకు తాను వచ్చానని... సదస్సులో మహిళా సమస్యలపై మాట్లాడే హక్కు తనకు లేదా? అని ప్రశ్నించారు. "నేను ఆంధ్రప్రదేశ్ లో పుట్టలేదా? నాకు ఏపీలో ఇళ్లు లేవా? నేను మీకు నచ్చకపోతే తీసుకెళ్లి వేరే రాష్ట్రంలో వదిలేస్తారా?" అంటూ నిప్పులు చెరిగారు.

చంద్రబాబు పాలన హిట్లర్ ను తలపిస్తోందని రోజా విమర్శించారు. పోలీసులను చంద్రబాబు బౌన్సర్లుగా వాడుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు డీజీపీ సాంబశివరావు బానిసలా పనిచేయడం ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. కర్నూలులో మహిళపై టీడీపీ నేతలు గ్యాంగ్ రేప్ చేస్తే... ఇంతవరకు డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. డీజీపీ ఇలాగే వ్యవహరిస్తూ పోతే... జనాల దృష్టిలో ఆయన విలన్ గా మిగిలిపోతారని అన్నారు.

More Telugu News