: వందల కోట్ల స్కాం జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు?: కేసీఆర్ ఫైర్

బోధన్ వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన కుంభకోణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంటే మీరంతా ఏం చేస్తున్నారంటూ సంబంధిత విభాగ ఉన్నతాధికారులపై నిప్పులు చెరిగారు. కేవలం రూ. 60 కోట్ల వరకే స్కాం జరిగిందంటూ నివేదిక ఇచ్చారని... ఇప్పుడేమో వందల కోట్లు దారి మళ్లినట్టు సీఐడీ నివేదికలో తేలిందంటూ ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ఇక నుంచి ప్రతి సర్కిల్ పరిధిలోని ఆడిటింగ్ ను కేంద్ర కార్యాలయాల్లో పర్యవేక్షించాలని... అధికారులపై నిఘాను పెంచాలని ఆదేశించారు. డీజీపీ అనురాగ్ శర్మతో సీఐడీ దర్యాప్తు గురించి ముఖ్యమంత్రి వాకబు చేశారు. ఈ స్కాంపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని, మరిన్ని టీమ్ లను రంగంలోకి దించి నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు.

More Telugu News