: జయలలిత కేసు విచారణకు ఎంత ఖర్చయిందో తెలుసా?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్ ల అక్రమాస్తుల కేసును విచారించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి భారీగానే ఖర్చు అయింది. సమాచార హక్కు చట్టం కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఆ ప్రభుత్వం లిఖితపూర్వకంగా తెలిపిన సమాధానం ద్వారా ఈ విషయం తెలుస్తోంది. 2004లో తమిళనాడు నుంచి ఈ కేసు కర్ణాటకకు బదిలీ అయ్యింది. 2004 నుంచి 2014 వరకు పరప్పన అగ్రహార జైలులో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు.

అంతే కాకుండా ఈ కేసు విచారణ సందర్భంగా చెలరేగిన అల్లర్లను అడ్డుకునేందుకు, కేటాయించిన సిబ్బంది, న్యాయశాఖ ఖర్చు.. ఇలా అన్ని ఖర్చులకు కలిపి కర్ణాటక ప్రభుత్వం 3.93 కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపింది. ప్రత్యేక న్యాయస్థానం వద్ద పోలీసు భద్రత, జయలలిత, ఇతర నిందితులు వచ్చి వెళ్లినప్పుడు ఏర్పాటు చేసిన ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, అధికారులు, సిబ్బంది వేతనాలు, ఇతర భత్యాల రూపంలో 90.13 లక్షల రూపాయలు చెల్లించారు. ఇందులో 2.36 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, మిగిలిన మొత్తాన్ని న్యాయ, హోం శాఖలు తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమచేశాయని తెలిపారు.  

More Telugu News