: తమిళనాడులో మరో విశ్వాస పరీక్ష.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం!

మరో విశ్వాస పరీక్షకు తమిళనాడు శాసన సభ వేదిక కాబోతోందా? డీఎంకే తీరు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా స్పీకర్ ధన్‌పాల్ వ్యవహరించిన తీరుపై గుర్రుగా ఉన్న డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఆయనపై విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు. స్పీకర్ ధన్‌పాల్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, ఆయనపై అవిశ్వాస తీర్మానం తీసుకొస్తామని తెలిపారు. ధన్‌పాల్‌పై అవిశ్వాస తీర్మానానికి తమ పార్టీకి చెందిన 34 మంది ఎమ్మెల్యేలు సంతకం పెడితే సరిపోతుందని అన్నారు. నిబంధనల ప్రకారం రెండు వారాల్లో సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాము కోరినట్టు రహస్య బ్యాలెట్ నిర్వహించి ఉంటే పళనిస్వామి సీఎం అయి ఉండేవారు కాదని స్టాలిన్ పేర్కొన్నారు. జయలలిత మృతిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయకపోవడంతో తమ అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయని స్టాలిన్ పేర్కొన్నారు.

More Telugu News