: అది పాక్ విజయం... భారత్ కు ఇష్టంలేని అంశాలపై చర్చించే విధంగా అప్పట్లో ఒప్పించాం!: ముషారఫ్

భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడడంలో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ దిట్ట. కశ్మీర్ లో ఉగ్రవాదులు, వేర్పాటు వాదుల వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని గతంలో ముషారఫ్ ప్రకటించారు. తాజాగా మరోసారి ఎప్పుడో జరిగిపోయిన, అప్రస్తుతమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మాట్లాడుతూ, తాను దేశాధ్యక్షుడిగా ఉన్న సమయంలో తమ యంత్రాంగం కశ్మీర్‌ లోని (తీవ్రవాదులు) స్వాతంత్ర్య సమర యోధులను మేనేజ్‌ చేసిందని అన్నారు. వారికి అన్నివిధాలా అండగా నిలిచిందని ఆయన తెలిపారు. వారిని వెనుక నుంచి నడిపించిందని ఆయన తెలిపారు.

అయితే కశ్మీర్ విషయంలో భారత్ తో చర్చలు ముందుకు సాగాలంటే కేవలం వారిని ముందుకు నడిపిస్తేనే సరిపోదని, రెండు దేశాల మధ్య రాజకీయ చర్చలు కూడా అవసరమని భావించామని, దీంతో వారికి మద్దతివ్వడం ఆపేశామని ఆయన చెప్పారు. అంతేకాకుండా భారత్ కు ఇష్టం లేని కశ్మీర్ అంశంపై చర్చలకు అంగీకరించేలా ఒప్పించడంలో విజయం సాధించామని, ఇది పాకిస్థాన్ విజయమని ఆయన తెలిపారు. భారత గూఢచారి సంస్థ సహాయంతో ఆఫ్ఘనిస్థాన్ నిఘా సంస్థ ఎన్డీఎస్ పాకిస్థాన్ లోని గిరిజన ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తుండగా వాటిని ధ్వంసం చేయడమే కాకుండా ఆపరేషన్ ‘జర్బ్‌ ఈ అజ్బ్‌’ పేరుతో వేలాది మంది ఉగ్రవాదులను అంతం చేశామని ఆయన చెప్పారు. 

More Telugu News