: చైనాలో వెలుగు చూసిన నిజమైన జురాసిక్ పార్క్!

లక్షలాది సంవత్సరాల క్రితం భూమి మీద జీవించిన డైనోసార్లను సీనీ దర్శకుల ప్రతిభతో సినిమాల్లో చూసి అంతా ఆశ్చర్యానికి గురయ్యారు.  కాగా, 65 నుంచి 145 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి నిజమైన జురాసిక్ పార్క్‌ ను చైనాలో ఝెజియాంగ్ ప్రావిన్స్‌ లో పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు 82 డైనోసార్ల అవశేషాలను ఇక్కడ గుర్తించినట్టు ఝెజియాంగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రోజియాలజీ అండ్ ఇంజినీరింగ్ జియాలజీ, ఝెజియాంగ్ మ్యూజియం ఆఫ్ హిస్టరీ ఇన్ చైనాకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. చరిత్ర పూర్వం నాటి 8 జంతు అవశేషాలు కూడా ఇక్కడ ఉన్నాయని, వాటిని కొత్తగా గుర్తించామని తెలిపారు. ఇందులో ఆరు డైనోసార్ జాతులున్నాయని చెప్పారు. డైనోసార్లతో పాటు వాటికి చెందిన 25 రకాల డైనోసార్ గుడ్ల అవశేషాలను కూడా గుర్తించామని వారు వెల్లడించారు. 

More Telugu News