: భారత్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముషారఫ్

భారత్ పై పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. పాకిస్థాన్ లో ఉగ్రదాడులు నిర్వహించేందుకు ఆఫ్ఘనిస్థాన్ నిఘా సంస్థ ఎన్డీఎస్ కు భారత్ సహకరిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పాక్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ లో మృతి చెందిన తీవ్రవాదులకు భారత నిఘా సంస్థ సహకరిస్తోందని ముషారఫ్ వ్యాఖ్యానించినట్టు పాక్ మీడియా పేర్కొంది. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ చర్చలకు తలొగ్గిందని ముషారఫ్ చెప్పారు. అంతేకాదు, తన హయాంలో ఉగ్రవాదులు లేరని... అందువల్ల వారిని నిర్మూలించాల్సిన పరిస్థితి తలెత్తలేదని గొప్పలు చెప్పుకున్నారు. ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయాద్ ఉగ్రవాది కాదని ఆయన అన్నారు.    

More Telugu News